29న సమన్వయకర్తల సమావేశం

పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయనున్న వైయస్‌ జగన్‌
తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్త సమావేశం ఈ నెల 29న తూర్పుగోదావరి జిల్లా జగ్గయ్యపేటలో జరుగనుంది. సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు తలశీల రఘురాం, కురసాల కన్నబాబు, జ్యోతుల చంటిబాబులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ కోఆర్డినేటర్ల పనితీర, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తారన్నారు. ఈ సమావేశానికి 175 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్‌ సమన్వయకర్తలు, రీజనల్‌ కోఆర్డినేటర్లతో పాటు ముఖ్యనేతలు హాజరవుతారన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర జరిగే రూట్‌లోనే టెంట్‌లో ఈ సమావేశం జరిగిందన్నారు. 
Back to Top