28న దీక్ష చేపట్టనున్న విజయమ్మ

హైదరాబాద్, 25 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని  అక్రమంగా  నిర్బంధించినందుకు నిరసనగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నిరశన దీక్ష చేపట్టనున్నారు. మే 28 తేదిన(మంగళవారం) హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఆమె నిరాహార దీక్ష చేస్తారని  పార్టీ నేతలు  తెలిపారు. 28 తేది మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తారని వివరించారు. శ్రీమతి విజయమ్మ దీక్షకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అభిమానులు, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంఘీభావం తెలపాలని పార్టీ నాయకులు విజ్క్షప్తి చేశారు.

Back to Top