ఈ నెల 27న వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే


పశ్చిమ గోదావరి: అధికార తెలుగు దేశం పార్టీకి కంచుకోట అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీకి బీటలు పడుతున్నాయి. టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైయస్‌ఆర్‌సీపీలోకి క్యూ కడుతున్నారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులైన అధికార పార్టీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. 27న వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రంగనాథరాజు చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఇవాళ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 27న భీమవరంలో వైయస్‌ జగన్‌ సమక్షంలో ఆయన వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 
 
Back to Top