ఆదినారాయణరెడ్డిని కేబినేట్‌ నుండి బర్తరఫ్‌ చేయాలి...

దళితులను కించపరుస్తూ మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై  వైయస్ ఆర్ సిపి ఎస్సి, ఎస్టీ విభాగపు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.మంత్రి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. పలు చోట్ల మంత్రి దిష్టి బొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మంత్రి ఆదినారయణరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతపురం టౌన్ క్లాక్ టవర్ వద్ద మంత్రి దిష్టిబొమ్మకు ఉరివేసి అనంతరం దగ్ధం చేశారు.  మడకశిర , అమరాపురం లలోనూ ఆందోళనలు జరిగాయి. అనంతపురం క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన ధర్నాలో  ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు పెన్నోబులేసు మాట్లాడుతూ మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆయన పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.  మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఎస్సీ,ఎస్టీ కేసు బనాయించాలని డిమాండ్‌ చేశారు.  వైయస్ ఆర్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి చింతకుంట మధు,ఎస్టీ సెల్‌ నగర అధ్యక్షులు సుబ్బరాయుడు, నాయకులు లింగారెడ్డి, రిలాక్స్‌ నాగరాజు, బండల శీనా, నారాయణరెడ్డి, కుళ్లాయిస్వామి, ఎంపీహెచ్‌పీసీఎస్‌ నాయకులు రవి, రమేష్, శీనా పాల్గొన్నారు.

మడకశిర రూరల్‌ లో వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి, మాజీ మంత్రి నర్సేగౌడ్, రాష్ట్ర వైయస్ ఆర్ సీపీ కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగేగౌడ్, దళిత నాయకులు మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 
అమరాపురం మాజీ సర్పంచు ప్రసాద్, ఎంపీటీసీ గోవిందరాయ, నాయకులు భీమరాజు, తిప్పేస్వామి, నరసింహమూర్తి, పీఆర్‌ మూర్తి, నాగరాజు, జేకే నరసింహమూర్తి, జోగింద్ర, సిధ్ధేశ్వర తదితరులు  మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని  డిమాండ్‌ చేశారు.
Back to Top