దళితుల ఓట్లు అడిగే అర్హత బాబుకు లేదు

  • దళితుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు
  • ఎస్సీ కార్పొరేషన్‌కు వైయస్‌ రాజశేఖరరెడ్డి జీవం పోశారు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగు నాగార్జున
నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహి అని, ఆయనకు నంద్యాల ఉప ఎన్నికలో ఓట్లు అడిగే అర్హత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. సమాజంలో ఉన్న రాజ్యాంగ హక్కులను హరించే ఏకైక వ్యక్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పేరు వచ్చిందన్నారు. అనాదిగా ఉన్న అస్పృస్యత, అంటరానితనం మరల ఈ రాష్ట్రంలో వేళ్లూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన నంద్యాలలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల గగరప్రరులో దళితులను వెలివేస్తే..ఈ రోజుకు చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. ఈస్టు గోదావరి జిల్లాలో ఆవు చర్మాన్ని కోస్తున్న దళితులను బహిరంగంగా కొట్టినా చంద్రబాబుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాజధాని నెపంతో గుంటూరు జిల్లాలో భూములు లాక్కున్ని దళితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నా చంద్రబాబు నోరు మెదపడన్నారు. 

ప్రకాశం జిల్లా దేవరపల్లిలో దళితుల భూములను లాక్కొని చెరువులు తొవ్వుతున్నా సీఎం మాట్లాడలేదన్నారు. ఎక్కడ దళితులకు సాయం చేశారని చంద్రబాబు ఈ రోజు ఓట్లు అడుగుతున్నారని, నంద్యాలలో ఓట్లు అడిగే హక్కు బాబుకు ఎక్కడుందని ప్రశ్నించారు. దళిత పల్లెల్లో నిలబడి ఓట్లు అడిగే అర్హత టీyî పీకి లేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ అనే మునిగిపోతున్న నావను దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కొన్ని కోట్లు ఇచ్చి బతికించారన్నారు. ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్‌ నిధులతో  చంద్రబాబు బొమ్మ వేసుకొని ఇన్నోవా కార్లు ఇస్తున్నట్లు ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. జూపూడి ప్రభాకర్‌ అనే వ్యక్తి దళిత ఉద్యమాలతో పైకి వచ్చానని చెప్పుకుంటూ..ఇవాళ చంద్రబాబుకు తొత్తుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రానికి సక్రమంగా తీసుకురావడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. జూపూడిని తన వద్ద పెట్టుకొని చంద్రబాబు ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు పూర్తిగా పచ్చ చొక్కాలకు పంచిపెడుతున్నారని విమర్శించారు.

Back to Top