25 గంటల దీక్షను విజయవంతం చేయండి

అనంతపురంః  ఉరవకొండ నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి... పక్కా ఇండ్లు నిర్మించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు పక్కా ఇళ్ల కోసం ఈనెల 12వ తేదీ నుండి 13వ తేదీ  సాయంత్రం వరకు జరిగే... 25 గంటల దీక్షను విజయవంతం చేయాలని విశ్వేశ్వర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో దీక్షకు సంబంధించిన కరపత్రాలు అందిస్తూ విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం చేపట్టారు. 

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. గతంలో కూడా ఇంటిపట్టాల కోసం 30 గంటల దీక్ష చేపట్టినట్లు తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. స్థానికంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. 
Back to Top