సంక్షేమ పథకాల అమలులో వివక్ష

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా వివక్ష జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన రాయచోటి నియోజకవర్గంలోగడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ముదినేనివడ్డిపల్లె, ముదినేనివాండ్లపల్లె,మద్దిరవాండ్లపల్లె, య్రరగుంట్ల, హరిజనవాడ, సుద్దలవాండ్లపల్లె, పేయలవాండ్లపల్లె, శ్రీనివాసపురంగ్రామాల్లో ఆయన  ఇంటింటికి వెళ్లి ప్రజలు  ఎదుర్కోంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం వారికి ప్రజాబ్యాలెట్‌ను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యే ఎదుట సమస్యలు ఏకరువు పెట్టారు. నారాయణరెడ్డిపల్లె ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఏటా నిర్వహించే జన్మభూమి కార్యక్రమాల్లో రేషన్‌కార్డులు, వివిధ రకాల పింఛన్ల కోసం అర్హులు అర్జిలు అందజేస్తున్నా మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికే కార్డులు, పింఛన్లు ఇస్తున్నారని ఆరోపించారు. తిరుమళరాయి గుట్టపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాభివృద్దికి, రహదారి సౌకర్యానికి తమవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. య్రరగుంట్లలో సిమెంట్‌ రోడ్డును విడతల వారిగా పూర్తి చేస్తానన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి దళితుల గృహాలకు ఉచిత విద్యుత్‌ అందించేవారని ,ఇప్పుడు ఆపద్దతి కొనసాగలేదంటూ  య్రరగుంట్ల హారిజన వాడ ప్రజలు  ఎమ్మల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మల్యే ఈ సమçస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకేళ్లి  సమస్యను పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి,డిసీసీబి డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, నాగరాజుయాదవ్, మండల కన్వీనర్‌  ఉదయకుమార్‌రెడ్డి, వసంత శ్రీనివాసులరెడ్డి, వడ్డివెంకట్రమణారెడ్డి,   పాల్గొన్నారు.

Back to Top