భార‌త క‌బ‌డ్జీ జ‌ట్టుకు వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

కబడ్డీ వరల్డ్ కప్‌లో ఇరాన్ పై గెలిచి విశ్వ‌విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఈ విజ‌యం దేశానికి గ‌ర్వ‌కార‌ణం అని, మ‌న క‌బ‌డ్డీ టీం ఇలాంటి విజ‌యాలు మ‌రిన్ని సాధించాల‌ని ఆకాంక్షించారు.  కాగా అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై  భారత్  38-29 పాయింట్ల తేడాతో గెలిచింది. కాగా ఫైనల్లో ఇరాన్ పై భారత్ గెలవడం ఇది మూడోసారి. గతంలో నాలుగు సార్లు పాకిస్థాన్ పై, నేటి మ్యాచ్ తో కలిపి ఇరాన్ పై మూడు సార్లు, కెనడాపై ఒకసారి భారత్ గెలుపొందింది. రైడర్ అజయ్ ఠాకూర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. వరుసగా ఐదు మ్యాచ్ ల్లో సూపర్ 10 సాధించాడు ఠాకూర్. ఫైనల్లోనూ ఒక దశలో వెనుకబడి ఉన్న భారత్ ను తన అద్భుత ప్రదర్శనతో గెలుపు దిశగా నడిపించాడు. ఫైనల్ మ్యాచ్ లోనూ సూపర్ 10 సాధించ‌డం విశేషం. 
Back to Top