2019లో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపు తధ్యం

విజయనగరం: 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు తధ్యమని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ధీమా వ్య‌క్తం చేశారు. జియమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్‌లో కురుపాం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామిలు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో పార్టీని పటిష్ట పరిచే దిశగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వారన్నారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతులను చేయాలని కోరారు. చంద్రబాబు మూడేళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, పెస్మత్స సాంబశివరావు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top