2019లో వైయ‌స్‌ఆర్‌సీపీదే అధికారం

వైయ‌స్ఆర్ జిల్లా: 2019వ సంవ‌త్స‌రంలో  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు ఉద్ఘాటించారు. గురువారం వైయ‌స్‌ఆర్‌ ఆడిటోరియంలో పార్టీ  నియోజ‌క‌వ‌ర్గ ప్లీనరీ సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భఃగా రైతు విభాగం రాష్ట్ర నాయ‌కుడు అర‌వింద‌నాథ‌రెడ్డి మాట్లాడుతూ..చీనీ, అరటి తోటల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. అరటి, చీనీకి సంబంధించి జ్యూస్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలన్నారు. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలన్నారు. మండ‌ల క‌న్వీన‌ర్ చంద్ర ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ..రుణ మాఫీ పేరుతో రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశారని మండిప‌డ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్నిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేద‌ని విమ‌ర్శించారు. రాయలసీమలో కరువు విలయతాండవం చేయడంతో ప్రజలు వలసలు వెళుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టీడీపీ నాయకులు రాంగోపాల్‌రెడ్డి పులివెందులలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని మహానాడులో మాట్లాడటం హాస్యాస్పదమ‌న్నారు. పులివెందుల అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయ‌న‌ సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంగముని, ఆర్‌.తుమ్మలపల్లె సర్పంచ్‌ మహేశ్వరరెడ్డి, వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు సర్వోత్తమరెడ్డి, రసూల్, ఎన్‌ఆర్‌ఐ రఘు, విద్యార్థి విభాగపు నాయకుడు జశ్వంత్, మున్సిపల్‌ కౌన్సిలర్లు, వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top