విశ్వసనీయతకు, వంచనకు నడుమనే 2019 ఎన్నికలు

దిమ్మతిరిగేలా బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధం

ఫిరాయింపు ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం
లేదు.

వైయస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహ్మద్
ఇక్బాల్ 

విజయవాడ: అసెంబ్లీ సమావేశాలకు వైయస్ ఆర్ కాంగ్రెస్ హాజరు
కాని విషయాన్ని పదేపదే  ప్రస్తావిస్తున్న ముఖ్యమంత్రి,
తెలుగుదేశం పార్టీ నాయకులు, అదే సమయంలో ఫిరాయింపుల దారులపై అనర్హత వేటు ఎందుకు
వేయడం లేదన్న విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు మహ్మద్
ఇక్బాల్ ప్రశ్నించారు. విలువలకు కట్టుబడి, ఒక సిద్ధాంతం కోసమే తమ పార్టీ
అసెంబ్లీకి హాజరు కావడం లేదనీ, దీనిని వెన్ను చూపి పారిపోవడంగా అభివర్ణించడం
అవివేకమన్నారు.  పార్టీ ఫిరాయించిన వారిపై
అనర్హత వేటు వేసిన మర్నాటి నుంచే, తమ పార్టీ వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని
ఆయన స్పష్టం చేశారు.  2019 లో జరగబోయే ఎన్నికలు
రాజకీయాల్లో విశ్వసనీయతకు, నయవంచనకు మధ్యనే జరుగుతాయన్నారు.  విజయవాడలోని పార్టీ కార్యాలయంలో  శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో
మాట్లాడారు.  ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో
కాకుండా, సొంత, రహస్య అజెండాలను అమలు పరుస్తూ, ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న
వారికి దిమ్మదిరిగే జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రజలకు
కావాల్సింది  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్,
ఈజ్ ఆఫ్ కరప్షన్లు  కాదని, ఈజ్ ఆఫ్
ఎడ్యుకేషన్, ఈజ్ ఆఫ్ హెల్త్, ఈజ్ ఆఫ్ వెల్పేర్ మొదలైనవని ఇక్బాల్ పేర్కొన్నారు.  క్షేత్ర స్థాయిలో ప్రజలకు మేలు జరిగేలా చూడటంతో  చంద్రబాబు విఫలమయ్యారని, కేవలం అంకెలగారడీ
కోసమే తపిస్తున్నారన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, టిడిపి లు రెండూ కూడా
రాష్ట్రాన్ని వంచించాయని,  ఒకరు కమలం
పువ్వు, మరొకరు క్యాబేజి పువ్వు పెట్టి ప్రజలను వంచించారని విమర్శించారు.  వీరిద్దరూ ఒకరిట్రాప్ లో మరొకరి పడి
రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం చేస్తున్నారన్నారని మండిపడ్డారు.  ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ అధ్యక్షులు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా  చెపుతున్న
మాటలను హేళన చేసిన టిడిపి వారే, పార్లమెంటులో అవే మాటలను మక్కిమక్కి చెప్పడంతో,
జగన్ మోహన్ రెడ్డి గారి వారి ఎంత వాస్తవమన్న విషయం ప్రజలందరికీ అర్ధం అయ్యిందన్నారు.  ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు
రెండు కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.  అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ప్రత్యేక
హోదా అమలుకోసం చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు, అబౌట్ టర్న్, యుటర్న్ లతో  హోదాను , ప్రజల ఆకాంక్షలను తాకట్టుపెట్టిన
తీరును  ప్రజలు ఏమాత్రం క్షమించరన్నారు. 

Back to Top