ప్రజల పార్టీ ప్రస్థానం-2015

జనం కోసం జననేత 
హోదా కోసం పోరుబాట

ప్రత్యేకహోదా
ఆంధ్రుల హక్కు నినాదంతో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్
జగన్ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఎనలేని పోరాటాలు చేశారు. చేస్తూనే
ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని ఆనాడు కాంగ్రెస్
అంటే , కాదు పదేళ్లు ఇవ్వాలని  ప్రస్తుత బీజేపీ హామీ ఇచ్చింది. పదిహేను
సంవత్సరాలు హోదా ప్రకటించాలని చంద్రబాబు అన్నారు. పార్లమెంట్ సాక్షిగా
ఇచ్చిన హామీకి కేంద్రం తూట్లు పొడిస్తే..హోదాను తీసుకురావడంలో టీడీపీ
ఘోరంగా విఫలమయ్యింది. చంద్రబాబు సర్కార్ చేతులెత్తేయడంతో ఆ బాధ్యతను వైఎస్
జగన్ తన భుజస్కందాలపై వేసుకున్నారు.   

తొలి గళం...
ఆంధ్రప్రదేశ్‌కు
ప్రత్యేక హోదాను కల్పించాలని వైఎస్సార్సీపీ ముందుండి క్రీయాశీల పోరాటం
కొనసాగిస్తోంది. సాధారణ ఎన్నికలు జరిగిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా
కావాలని తొలుత గళం విప్పింది వైఎస్సార్పీపీయే. ఈ విషయమై అధికారపక్షమైన
టీడీపీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నా.... వైఎస్ జగన్ మాత్రం అవకాశం
వచ్చినపుడల్లా ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు.
ప్రధాని పదవి చేపట్టకముందు, చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో
వెళ్లి మోదీని కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

ఢిల్లీ పెద్దలను కలిసి..
2015
మార్చిలో మరోసారి ఎంపీలతో ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్...  ప్రధాని
నరేంద్రమోదీని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను మరోసారి
వివరించారు.  అలాగే ఈ ఏడాది జూన్ 9వ తేదీన కూడా వైఎస్ జగన్ ఢిల్లీలో
రాష్ట్రపతిని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా చర్యలు
తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరి 15, మార్చి 30,
జూన్ 9, 10 తేదీల్లోఢిల్లీలో కేంద్ర మంత్రివర్గంలోని పలువురు కీలక
మంత్రులను కలిశారు. 

మొక్కవోని సంకల్పం..
ప్రత్యేకహోదా
కోసం వైఎస్ జగన్ చేయని పోరాటం లేదు. ప్రత్యేకహోదా వస్తే యువతీయువకులు
జీవితాలు బాగుపడతాయని రాష్ట్రానికి పెట్టుబడులు వాటంతట అవే తరలివస్తాయని
ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. విశాఖ,
తిరుపతిలలో జరిగిన యువభేరిలలో వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకహోదా
ప్రాముఖ్యతను చాటిచెప్పారు. మంగళగిరి, ఢిల్లీలో దీక్షలు చేపట్టారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షతో  ప్రత్యేకహోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం
చేశారు. రాష్ట్రంలో బంద్, ధర్నాలు, రిలేదీక్షలు  చేపట్టారు. అసెంబ్లీలో
టీడీపీ ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేకహోదా తీర్మానం చేయించారు. 

కుట్రలు పటాపంచలు చేస్తూ..
ఐనా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాకపోవడంతో స్వయంగా వైఎస్ జగన్  నవంబర్
26 నుంచి నిరవిధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. నిద్రాహారాలు మాని
ఏడురోజుల పాటు నిర్విరామంగా దీక్ష కొనసాగించారు. దీంతో, వణికిపోయిన
చంద్రబాబు అర్థరాత్రి పోలీసులతో దీక్ష భగ్నం చేయించి ఆస్పత్రికి తరలించారు.
అక్కడ కూడా జననేత దీక్ష చేపట్టగా బలవంతంగా వైద్యుల చేత ప్లూయిడ్స్
ఎక్కించారు. రాష్ట్ర ప్రజానీకమంతా వైఎస్ జగన్ కు అండగా కదం తొక్కింది.
వైఎస్ జగన్ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు అడ్డుకునేందుకు కుట్రలు
చేశాడు. ఐనా మొక్కవోని దీక్షతో వైఎస్ జగన్ ముందుకు సాగారు. రాష్ట్రానికి
ప్రత్యేకహోదా వచ్చే దాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 
Back to Top