టీడీపీ నుంచి 200 మంది వైయస్‌ఆర్‌ సీపీలోకి

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పోరాటాలకు ఆకర్షితులై అధికార పార్టీ నుంచి వైయస్‌ఆర్‌ సీపీ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. నందికొట్కూర్‌ నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశం వేదికపై 200 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, ఎమ్మెల్యే ఐజయ్య, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డిల సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు వైయస్‌ఆర్‌ సీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top