200 మంది యువ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌క‌ర్నూలు: ప్రజా సమస్యలు వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఎక్క‌డికి వెళ్లినా వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని నిన‌దిస్తున్నారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. నిత్యం ఏదో ఒక చోట అధికార పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా గురువారం క‌ర్నూలు న‌గ‌రానికి చెందిన 200 మంది యువకులు శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి పార్టీ కండువాలు క‌ప్పి ఆయ‌న సాద‌రంగా ఆహ్వానించారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు సైనికుల్లా ప‌ని చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు హాఫిజ్‌ఖాన్‌, బీవై రామ‌య్య‌. సురేంద్ర‌రెడ్డి,రాజావిష్ణువర్ధన్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్లమెంటు కార్యదర్శి కరుణాకర్ రెడ్డి ,కర్నూలు  నాయకులు సాంబ శివారెడ్డి గారు,  బీసీ  సెల్ కార్యదర్శి దనుంజయ ఆచారి ,  వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎస్సీ సెల్ అధ్యక్షుడు సీహెచ్‌ మద్దయ్య, నాయకులు టి. జగన్నాథ రెడ్డి,  క్రిష్ణ కాంత్ రెడ్డి,  రాఘవేంద్ర రెడ్డి ,  అశోక్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top