200 టీడీపీ కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీసీలో చేరిక


చిత్తూరు:  సీఎం సొంత జిల్లాలో  టీడీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంకల్ప యాత్ర గురువారం చిత్తూరు జిల్లాలోకి ప్ర‌వేశించింది. ఈ సంద‌ర్భంగా టీడీపీకి చెందిన 200 కుటుంబాలు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి.  పెద్దమండ్యం మండలం దిగువపల్లె, మందలవారిపల్లెకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు రెడ్డెప్పరెడ్డి, చంద్రానాయక్‌ తదితరులు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.  కార్యక్రమంలో ఈశ్వరరెడ్డి, రమణారెడ్డి, రంగానాయక్, మూడేనాయక్, శివ, మల్లేనాయక్, శంకర్, జయానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top