వైయస్‌ఆర్‌ సీపీలో 200 కుటుంబాలు చేరిక

  • శిల్పా చక్రపాణిరెడ్డి సమక్షంలో చేరికలు
  • వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించం
  • శిల్పా మోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి
నంద్యాల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అందుకు పార్టీలో చేరికలే నిదర్శనం. వైయస్‌ఆర్‌ సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో పొన్నాపురానికి చెందిన 200 కుటుంబాలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరాయి. ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తే సహించేది లేదన్నారు. చంద్రబాబు ఆటలు నంద్యాలలో సాగవన్నారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారంటే అది దివంగత మహానేత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానం, జననేత వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకమేనన్నారు. 

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి,  అంతే కాని తప్పుడు ఆరోపణలు, కేసులు పెడితే సహించబోమన్నారు. టీడీపీ మూడేళ్లుగా చేసిన అభివృద్ధి ఏముందో ఓటర్లకు చెప్పుకోవాలని ఎద్దేవా చేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలం అని చెప్పుకుంటూ తిరుగుతున్న మంత్రి అఖిలప్రియకు శిల్పా చురక అంటించారు.  మీ నాన్న భూమా నాగిరెడ్డి 150 మందిని చంపాడని, బాధిత కుటుంబాల పిల్లలను తీసుకొచ్చి నంద్యాలలో ప్రచారం చేయిస్తానని అన్నారు. అబద్ధాలు చెప్పి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనే ఆలోచనలో భూమా కుటుంబం ఉందన్నారు. టీడీపీ కుట్రపూరిత పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలంతా ధైర్యంగా వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేయాలని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి శిల్పా మోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 
Back to Top