బాబు వ్యాపారం కోసం 20 గ్రామాలు ఖాళీ

హైదరాబాద్) ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సీడ్ క్యాపిట‌ర్ ప‌రిధిని 20 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు పెంచ‌డంతో 20 గ్రామాలు ఖాళీ చేయాల్సిన దుస్థితి నెల‌కొంద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గురువారం ఆయ‌న హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ రాజ‌ధానికి వ్య‌తిరేకం కాద‌ని, రాజ‌ధాని ముసుగులో చంద్ర‌బాబు రైతుల్నీ, పేద‌లను ఏ ర‌కంగా మోసం చేస్తున్నారో దానికి వ్య‌తిరేక‌మ‌న్నారు. సీఆర్‌డీఏ క్యాపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆథారిటీని చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆథారిటీగా మార్చార‌ని మండిప‌డ్డారు.  చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి భూములు, పొలాలు ఇచ్చిన వారు సైతం బాబు రియ‌ల్ఎస్టేట్ వ్యాపారాన్ని గ్ర‌హించి కోర్టుల‌కు వెళ్లి మ‌రి వారికి అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నార‌ని తెలిపారు. 
కాళ్లు మొక్కుతా అన్న బాబు... ఇప్పుడు కాళ్లు లాగేస్తున్నాడు...
భూములిచ్చిన రైతుల‌ను కాళ్లుమొక్కుతాన‌న్న చంద్ర‌బాబు ఇవాళ‌ అదే రైతుల కాళ్లు లాగేస్తున్నార‌ని రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శించారు. బాబు మాయ‌మాట‌లు న‌మ్మి పొలాలు, భూములిచ్చిన వారికి  పూర్తి లోత‌ట్టు ప్రాంతంలోనే ఇచ్చేందుకు సీఆర్‌డీఏ గ‌తంలోనే స‌న్న‌హాలు చేసింద‌ని చెప్పారు. ఒక‌వైపు   లోత‌ట్టు ప్రాంతామ‌ని తెలిసి కూడా ప్ర‌భుత్వ ప‌రంగా నిర్మాణాలు చేప‌డుతుంద‌న్నారు. మాములు ప్రాంతంలోనే నాలుగైదు, మీట‌ర్లు ఎత్తు లెపాల‌ని సీఆర్‌డీఏ నిర్ణ‌యం తీసుకుంటే, అదే ముంపు ప్రాంతంలో కేటాయించిన భ‌వ‌నాల‌కు క‌నీసం 15 మీట‌ర్ల ఎత్తు పెంచుకుంటే త‌ప్ప వారు నిర్మించుకునే భ‌వ‌నాలు ఒక స్థాయికి రావ‌ని ఆర్కే వివ‌రించారు. ఆ ప్రాంతం మొత్తం ఒక లెవ‌ల్‌కు రావాలంటే తిరుమ‌ల తిరుప‌తి కొండ‌ను మొత్తం త‌వ్వితే త‌ప్ప ఆ లోతు పూర్తి కాద‌న్నారు. 
అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను తుంగ‌లో తొక్కారు
ఒక‌వైపు అంబేద్క‌ర్ 125 జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పుకుంటున్న బాబు స‌ర్కార్ మ‌రి సీఆర్‌డీఏ చ‌ట్టంలో రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌కుండా ఆయ‌న ఆశ‌యాల‌ను తుంగ‌లో తొక్కార‌ని ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఆర్‌డీఏలో రిజ‌ర్వేష‌న్లు ఉండ‌వు... కేవ‌లం ప్ర‌తిభ‌కే మేము ప్రాదాన్య‌త ఇస్తామంటున్న టీడీపీ మ‌రి వాసుదేవ‌న్ ఒక పేద బ్ర‌హ్మ‌ణుడికి ఉద్యోగం ఇస్తే ఆయన ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి నూత‌న ఉద్యోగంలో చేర‌డానికి వెళ్తే అక్క‌డ నువ్వు మా వ‌ర్గానికి చెందిన వ్య‌క్తివి కాద‌ని బ‌య‌ట‌కు నెట్టివేస్తే.. కోర్టును ఆశ్ర‌యించార‌ని రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. రాజ‌ధాని ప్రాంతంలో ఉచిత విద్య‌ను అందిస్తామ‌న్న చంద్ర‌బాబు, నారాయ‌ణ‌, పుల్లారావులు ఒక్క విద్యార్థికైనా ఉచితంగా విద్య‌ను నేర్పిచారా అని ప్ర‌శ్నించారు.
Back to Top