18న గుంటూరు జిల్లాలోకి పాదయాత్ర

నల్గొండ 15 ఫిబ్రవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల ఫిబ్రవరి ఆరోతేదీన మరో ప్రజా ప్రస్థానం పాద యాత్రను పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. యాత్ర ఈనెల 18 నుంచి గుంటూరు జిల్లాలో అడుగిడుతుంది. గురజాల నియోజకవర్గంలో పాదయాత్ర ఆ రోజు సాయంత్రం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. 13 నియోజకవర్గాలలో 270 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది. కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం ఈ విషయాన్ని వెల్లడించారు.

Back to Top