179వ రోజుకు చేరుకున్న పాదయాత్ర

కాకినాడ 14 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 179వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆమె తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.  జిల్లా కేంద్ర కాకినాడలోని వైయస్‌ఆర్‌ ఫ్లైఓవర్‌ నుంచి శ్రీమతి షర్మిల శుక్రవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. ఆమెతో పాటు వేలాదిమంది దివంగత మహానేత డాక్టర్  వైయస్ఆర్‌ అభిమానులు యాత్రలో పాల్గొన్నారు. శుక్రవారంనాడామె భానుగుడి సెంటర్, నాగమల్లితోట జంక్షన్‌, సర్పవరం జంక్షన్‌, అచ్చంపేట జంక్షన్‌, తిమ్మాపురంల్లో పాదయాత్ర చేస్తారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌ రెండూ నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర కొనసాగనుంది.

Back to Top