175వ రోజు ‘మరో ప్రజాప్రస్థానం’ 14.4 కి.మీ.

మండపేట (తూ.గో.జిల్లా),

10 జూన్‌ 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌, జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం 175వ రోజుకు చేరింది. శ్రీమతి షర్మిల పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీన‌‌ర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రకటించారు.

మండపేట కె.పి. రోడ్డు నుంచి సోమవారం ఉదయం శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఆమె మారేడుబాక, పులగుర్త, మాచవరం వరకూ 7.2 కిలోమీటర్ల నడుస్తారు. అనంతరం అక్కడే ఆమె మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం బయలుదేరి పసలపూడి, వైయస్‌ఆర్ స్టాట్యూ, రామచంద్రపురం‌ వరకూ 7.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.

రామచంద్రపురంలో బహిరంగ సభలో శ్రీమతి షర్మిల వైయస్‌ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం ఆమె రామచంద్రపురంలోనే రాత్రికి బస చేస్తారు. శ్రీమతి షర్మిల సోమవారం మొత్తం 14.4 కిలోమేటర్లు పాదయాత్ర చేస్తారని రఘురాం, చిట్టబ్బాయి వివరించారు.

Back to Top