వచ్చే నెల 8నుంచి గడప గడపకూ వైయస్సార్సీపీ

హైదరాబాద్) వచ్చే నెల 8న అంటే
దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు నుంచి గడప గడపకూ వైయస్సార్సీపీ
కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ నాయకులు పార్థ సారధి
ప్రకటించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో
మాట్లాడారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మోసాలు, అబద్దాలు
వివరించటమే కాకుండా ఏ ఏ రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందీ ప్రతీ ఇంటికీ
తెలియచేస్తామని వెల్లడించారు. ప్రజల తరపున పోరాటం చేయటంలో వైయస్సార్సీపీ
అనుసరిస్తున్న వైఖరిని వివరిస్తామని పేర్కొన్నారు. ఈ బ్రహత్తర కార్యక్రమం మీద
చర్చించేందుకు ఈ నెల 13న విజయవాడలో విస్త్రత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు
చెప్పారు. ఇందులో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం
చేస్తారని పార్థ సారధి వెల్లడించారు. 

Back to Top