విశాఖపట్నం: ప్రజలతో మమేకమవుతూ..వారి సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. ఈ నెల 16న విజయనగరంలోకి వైయస్ జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించేందుకు పలు సంఘాలు, న్యాయవాదులు, పార్టీ కార్యకర్తలతో వైయస్ జగన్ భేటి ఉంటుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 10న సిరిపురం విజ్ఞాన్ గ్రౌండ్‌లో బ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని వివరించారు. అదే విధంగా వైయస్ జగన్ అధ్యక్షతన ఈ నెల11న వైయస్ఆర్ సీపీ సమన్వయకర్తలు సమావేశం ఉంటుందని.. ఈ సమావేశానికి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కో ఆర్డినేటర్లు హాజరవుతారన్నారు. ఈ నెల 12న అరిలోవ బీఆర్‌టీఎస్ రోడ్డులో ముస్లింలతో వైయస్ జగన్ ఆత్మీయ సమవాశం ఉంటుదన్నారు. అదేవిధంగా ఈ నెల 15న న్యాయవాదులు వైయస్ జగన్‌ను కలవనున్నారని వివరించారు.