16న రావికంపాడులో బహిరంగ సభ

హైదరాబాద్, 13 మే 2013:

స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏ విధంగా సమాయత్తం కావాలనే అంశంపై రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారు డి.ఏ. సోమయాజులు వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఆ సమావేశ వివరాలను సోమవారం మధ్యాహ్నం సోమయాజులు మీడియాకు తెలియజేశారు. శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈనెల 16న 2000 కిలోమీటర్ల మార్కును చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలోని రావికంపాడులో సభను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఆమెకు సంఘీభావంగా ఆ సభలో పాల్గొంటారని తెలిపారు. 17వ తేదీన హైదరాబాద్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటవుతుందని వెల్లడించారు. సీజీసీ సభ్యులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సమన్వయకర్తలు పాల్గొంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో మరోసారి విస్తృతంగా చర్చిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తమ పార్టీ అత్యధిక జడ్పీ స్థానాలను గెలవబోతోందని సర్వేలు చెబుతున్న విషయాన్ని ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు. 2001లో 12 జడ్పీలను గెలిచిన తర్వాత టీడీపీ మళ్ళీ జడ్పీలలో విజయం సాధించని విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలలో ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై విస్తృత సమావేశంలో చర్చిస్తామని సోమయాజులు తెలిపారు.

ఈ నెల మూడో వారంలో ప్రాణహిత ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించాలని నిర్ణయించామని వెల్లడించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ అధ్యక్షతన పార్టీ సీనియర్ నేతలు అక్కడికి వెడతారన్నారు. అక్కడ సభ కూడా ఏర్పాటవుతుందన్నారు. రచ్చబండ కార్యక్రమాలను కూడా శ్రీమతి విజయమ్మ నిర్వహిస్తారని చెప్పారు. 20, 21  లేదా 22 తేదీలలో ఏదో ఒక రోజు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

ఓదార్పు యాత్రను పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డిగారే చేపడితే బాగుంటుందని సమావేశం అభిప్రాయపడిందన్నారు. నియోజకవర్గంలో వివాహానికి హాజరుకావాల్సి ఉన్నందున కొణతాల రామకృష్ణ పీఏసీ సమావేశానికి హాజరుకాలేదు తప్ప దీనికి పెద్ద రాజకీయ ప్రాధాన్యం లేదని సోమయాజులు స్పష్టంచేశారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటవుతున్న సభకు హాజరవుతానని కొణతాల చెప్పారని తెలిపారు. పీఏసీ సమావేశానికి 

ఎంపి
మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరా రెడ్డి, సోమయాజులుతో పాటు పలువురు నేతలు
హాజరయ్యారు.

Back to Top