అన్నొచ్చాడు
- ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా నీరాజ‌నాలు
- దారి పొడ‌వునా స‌మ‌స్య‌ల వెల్లువ‌
- అంద‌రికీ భ‌రోసానిస్తున్న రాజ‌న్న బిడ్డ‌
ప‌శ్చిమ గోదావ‌రి:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ,నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో అన్యాయానికి గురైన వారికి అండ‌గా ఉండేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. అన్నొస్తున్నాడ‌ని స‌మాచారం తెలుసుకున్న గ్రామ‌స్తులు ప‌నులు మానుకొని ఎదురెళ్లి జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. దారి పొడ‌వునా ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రిస్తూ స్వాంత‌న పొందుతున్నారు. గ‌తేడాది నవంబ‌ర్ 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి మొద‌లైన జ‌న‌నేత పాద‌యాత్ర వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి కాగా, ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ సలహా మండలి సభ్యులు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. దీంతో వైయ‌స్‌.జగన్‌ తన పాదయాత్రను, బహిరంగసభను రద్దు చేసుకుని హుటాహుటిన ఆదివారం ఉదయం హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. వాస్తవానికి శనివారం రాత్రే సోమయాజులును పరామర్శించేందుకు వెళ్లాల్సి ఉండగా, ఆయన ఆరోగ్యం బాగుందన్న సమాచారం తెలియడంతో వైయ‌స్‌.జగన్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ తరుణంలో ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రజా సంకల్ప యాత్ర యథావిధిగా జరుగుతుందని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే అనుకోనివిధంగా ఆదివారం తెల్లవారుజాము∙3.50 గంటలకు సోమయాజులు మరణవార్త తెలియడంతో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వెనువెంటనే హైదరాబాద్‌ వెళ్లారు. మండలంలోని వెల్లమిల్లి స్టేజ్‌ వద్ద నుంచి జాతీయ రహదారి 16 మీదుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆయన హైదరాబాద్‌  వెళ్లారు. అక్కడ సోమయాజులు భౌతిక కాయాన్ని వైయ‌స్ జగన్‌ సందర్శించి నివాళులర్పించారు. 

నేడు బ‌హిరంగ స‌భ‌
 ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు సోమ‌వారం ఉద‌యం వెంకటరామన్న గూడెం శివారు నుంచి ప్రారంభమైంది.  ఇవాళ ఉదయం  వెంక‌ట‌రామ‌న్న గూడెం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ పాద‌యాత్ర మొద‌లుపెట్టారు.  వెల్లమిల్లి, పెద్ద తాడేపల్లి  మీదుగా తాడేపల్లిగూడెం మార్కెట్ వ‌ర‌కు పాద‌యాత్ర సాగుతోంది. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌ సెంటర్‌లో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని వైయ‌స్ఆర్‌ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ కోరారు. 

Back to Top