163వ రోజు షర్మిల పాదయాత్ర 11 కిలోమీటర్లు

పాలకొల్లు (ప.గో.జిల్లా),

29 మే 2013:‌ మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు‌డు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నేడు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానికి రక్షణగా నిలిచిన చంద్రబాబు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం నాటికి 163వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం ఆమె పాలకొల్లులోని బ్రాడీపేట నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి జిన్నూరు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి వేడంగి మీదుగా పోడూరు మండలం కవిటం గ్రామానికి శ్రీమతి షర్మిల పాదయాత్ర చేరుకుంటుందని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్‌ బాలరాజు తెలిపారు. బుధవారం రాత్రికి ఆమె కవిటంలో బసచేస్తారని వారు పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top