150 వ రోజుకు షర్మిల యాత్ర

చింతలపూడి, 15 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాడు 150వ రోజుకు చేరుతుంది.  వెంకటాపురం గ్రామంనుంచి యాత్ర ప్రారంభమై బోరంపాలెం వరకూ సాగుతుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. తదుపరి వల్లంపట్ల, మల్లుకుంట, మహాలక్ష్మిపురం మీదుగా రావికంపాడు గ్రామానికి చేరుతుంది. ఇక్కడే ఆమె యాత్ర రెండు వేల కిలోమీటర్ల మార్కును చేరుతుంది. అక్కడ ఏర్పాటయ్యే భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొంటారు.

Back to Top