రావికంపాడులో రక్తదాన శిబిరం

రావికంపాడు, 17 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించి 150రోజులు పూర్తవడంతోపాటు రెండువేల కిలో మీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా గురువారం కామవరపుకోట మండలం రావికంపాడులో వైయస్ఆర్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యాన రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. పేదలకు ఉపయోగపడే విధంగా రక్తాన్ని అందించాలనే ఉన్నతాశయంతో చేపట్టిన ఈ రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ రక్తదానం చేశారు. కడపకు చెందిన 60మంది మహానేత డాక్టర్ వైయస్ఆర్ అభిమానులు, వందలాది మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడేలకు చెందిన ఏరియా ఆస్పత్రుల వైద్యులు డాక్టర్ శివకుమార్, డాక్టర్ స్వర్ణశ్రీనివాస్, డాక్టర్ జి.రామారావు, డాక్టర్ యుగంధర్, వైయస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు కె.వెంకటరత్నంనాయుడు పాల్గొన్నారు.

Back to Top