14 సొసైటీలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జెండా

ఒంగోలు :

ప్రకాశం జిల్లాలో శాంతిభద్రతల సాకుతో ప్రభుత్వం ఎన్నిక నిలిపివేసిన 16 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో మొత్తం 14 సంఘాలను వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కైవసం చేసుకుంది. బేస్తవారిపేట, పెద్దారవీడు సొసైటీల పాలకవర్గాలు మే 31న ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఆ రెండు సొసైటీల్లో వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

‌తాజాగా సోమవారం మిగిలిన 14 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 12 సొసైటీలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఒక సొసైటీ‌లో కాంగ్రెస్ గెలుపొందగా, మరో సొసైటీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్, ‌టిడిపిల మధ్య పోటీ నెలకొంది.

శాంతిభద్రతల సాకుతో ఎన్నిక నిలిపివేసిన ఈ సొసైటీలన్నింటిలో సోమవారం ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. దీన్నిబట్టి ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ పార్టీ ఆ సొసైటీల ఎన్నికలను వాయిదా వేయించిందనేది తేటతెల్లమైంది.

తాజా వీడియోలు

Back to Top