తెలంగాణ అంతటా బలపడదాం

పులివెందుల)
తెలంగాణ కు చెందిన వైఎస్సార్సీపీ  నాయకులు
పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ను కలిశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు చెందిన
జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఇందులో ఉన్నారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా
జరగనున్న ఎమ్మెల్సీ  ఎన్నికల మీద చర్చ
జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా తెలంగాణ లో పార్టీ తీరు తెన్నుల మీద చర్చ జరిగింది.

ఖమ్మం జిల్లాలో
వైఎస్ఆర్ సీపీని నిజాయితీగా ముందుకు తీసుకెళ్తున్నారని వైఎస్ జగన్ పార్టీ నేతలతో
అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ బలపడుతుందని
ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన
బాధ్యత మీదేనంటూ ఖమ్మం జిల్లా నేతలను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు.

Back to Top