13వ సారి అవిశ్వాస తీర్మానం నోటీసు

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొసాగిస్తోంది. తాజాగా 13వ సారి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేసింది. ప్రత్యేక హోదాపై చర్చ జరపాలని అవిశ్వాస తీర్మానం నోటీసులో కోరారు. ఈ మేరకు గురువారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేశారు. ఇప్పటి వరకు వైయస్‌ఆర్‌సీపీ 13 సార్లు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై నోటీసు అందజేసింది. పార్లమెంట్‌ చరిత్రలో ఒకే పార్టీ ఇన్నిసార్లు నోటీసులు ఇవ్వడం వైయస్‌ఆర్‌సీపీనే ప్రథమం. కాగా, ఈ నెల 6వ తేదీ పార్లమెంట్‌ సమావేశాలు చివరి రోజు కావడంతో ఆఖరి రోజైనా అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించాలని కోరారు. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీ వేదికగా ఆమరణనిరాహార దీక్షలు చేస్తారు.

  
 
Back to Top