<br/>హైదరాబాద్ః భూములివ్వకపోతే ఏమైనా చేస్తామంటూ మంత్రులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత మర్రి రాజశేఖర్ అన్నారు.భూసమీకరణకు సహకరించని వారందరినీ భూసేకరణ చేస్తాం, పంటలు తగలబెడతామని బెదిరింపులకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని చెప్పుకుంటున్న ప్రభుత్వం...పంటలు ఎందుకు తగలబెడుతుందని ప్రశ్నించారు. కోర్టుల్లో వందలాదిగా కేసులు ఎందుకు నమోదవుతున్నాయని నిలదీశారు.<br/>రైతుల పంటలు తగలబెట్టి..తిరిగి బాధిత రైతులపైనే అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని రాజశేఖర్ ఫైరయ్యారు. రైతులను భయపెట్టి భూములు లాక్కోవడమే ధ్యేయంగా...మంత్రులు నారాయణ, పుల్లారావులు రాజధాని ప్రాంతంలో తిష్టవేసి అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. పంట తగలబెట్టింది తెలుగుదేశం వాళ్లేనని ప్రజలంతా చెబుతున్నారని మర్రి రాజశేఖర్ అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి పంటనే తగలబెట్టించి కేసులు బుక్ చేశారంటే..చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడనడానికి నిదర్శనమన్నారు.