తిరుపతి: రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద పోలీసుల దాడులు ఆగటం లేదు. మొన్న భూమా నాగిరెడ్డి, నిన్న రోజా, ఆమె అనుచర నాయకులు.. నేడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఏకంగా ఆయన వాహనాన్ని జీపుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. కొంత కాలంగా ప్రజా సమస్యల మీద ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పచ్చచొక్కాల దౌర్జన్యాల్ని ఆయన ఎదుర్కొంటున్నారు. దీనిపై మండిపడుతున్న తెలుగుదేశం నాయకులు ఆయన పై కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.