ఈ నెల 28న రాష్ర్ట బంద్

 ఆంధ్రప్రదేశ్‌కి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు గాను ఈ నెల 28వ తేదీన రాష్ర్టవ్యాప్త బంద్ పాటించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని చెప్పినపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, ఇకముందు మరింత ఉధృతం చేస్తామని జగన్ ప్రకటించారు. ఈనెల 28న రాష్ర్ట బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో చంద్రబాబును నిలదీస్తామని చెప్పారు. చంద్రబాబు మీడ, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికే అసెంబ్లీ జరగడానికి మూడు రోజుల ముందు 28 వ తేదీన రాష్ర్టవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నామని జగన్ చెప్పారు. 
Back to Top