టెన్త్ పేప‌ర్ లీక్‌..ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై వాయిదా తీర్మానం

ఏపీ అసెంబ్లీ: ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్నాప‌త్రం లీకేజీపై ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్న అంశంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. స‌భ ప్రారంభం కాగానే లీకేజీపై చ‌ర్చ‌కు ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ప‌ట్టుబ‌ట్ట‌గా ప్ర‌భుత్వం అంగీక‌రించ‌లేదు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు స్పీక‌ర్ పోడియం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం..లీకేజీ రాజ్యం..ప్యాకేజీ రాజ్యం అంటూ నిన‌దించారు. ఈ స‌మ‌యంలో మంత్రుల‌కు స్పీక‌ర్ మైక్ ఇవ్వ‌డంతో వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు దిగారు.

Back to Top