10న విశాఖలో బ్రాహ్మణులతో జననేత ఆత్మీయ సమావేశం

తిరుపతిః రాష్ట్రంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిది అని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కులానికి కార్పొరేషన్‌ పెట్టి 10 పైసాలు ఇస్తామని చెప్పి, 1,2 పైసాలు విదిల్చి చంద్రబాబు మోసగించారన్నారు.   బ్రాహ్మణ సామాజిక వర్గం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని వారి ఇబ్బందులను కూలంకషంగా చర్చించడానికి ఈ నె 10న విశాఖలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైయస్‌ జగన్‌ బ్రాహ్మణ వర్గంతో చర్చించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతారన్నారు.
Back to Top