పట్టిసీమపై బాబుకు అంత మోజు ఎందుకో :పార్ధసారది

పట్టిసీమ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంత మోజు ఎందుకుని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రశ్నించింది. పార్టీ అదికార ప్రతినిధి, మాజీ మంత్రి కె.పార్ధసారది మీడియాతో మాట్లాడుతూ 22 శాతం ఎక్కువకు టెండర్ ఇచ్చినందునే దానిపై అంత మోజా అని అన్నారు.ఏడాదిలో నిర్మాణం పూర్తి అవుతుందని అనడంపై ఆయన ఎద్దేవ చేశారు. పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమకు నీరిస్తామని మోసపూరిత మాటలు చెబుతున్నారని,ఈ డబ్బు ఇక్కడ వృదా చేసే బదులు , రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టి ఉంటే ఎక్కువ ఉపయోగం ఉండేదని పార్దసారధి అన్నారు. పట్టిసీమపై ఉన్న మోజు పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు చూపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.

Back to Top