తెలుగుదేశానికి చుర‌క‌లు

అసెంబ్లీ లో తెలుగుదేశం పక్షానికి ఎమ్మెల్యే బుగ్గ‌న రాజా చుర‌క‌లు అంటించారు. కార్మిక చ‌ట్టాల‌కు స‌వ‌ర‌ణ‌ల మీద ఆయ‌న స్ప‌ష్టంగా, సూటి గా ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం స‌భ్యులు సెటైర్లు వేయ‌టంతో అంతే ధీటుగా రాజా తిప్పికొట్టారు. ఒక‌సారి చెబితే స‌బ్జెక్టు లేదంటున్నార‌ని, రెండోసారి చెబితే ఇలా అంటున్నార‌ని ఆయ‌న అన్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీరామారావు చెప్పిన వ్యాఖ్య‌ల్ని గుర్తు చేశారు. చిన్న చినుకులు కురిస్తేనే పంట‌లు పండుతాయ‌ని, పెద్ద పెద్ద ఉరుముల‌కు పంట‌లు పండ‌వ‌ని రాజా చెప్పారు. దీంతో అధికార ప‌క్షానికి నోట మాట రాలేదు.

Back to Top