వైయస్ఆర్‌సీపీలోకి 105 కుటుంబాలు


ప్ర‌కాశం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు, ఆ య‌న ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌కు ఆక‌ర్శితులై ప‌లువురు వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా ప్ర‌కాశం జిల్లా  గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కొమ‌రోలు మండ‌లం బ్ర‌హ్మ‌ణ‌ప‌ల్లెకు చెందిన 105 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఐవీ రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  వీరికి ఐవీ రెడ్డి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు, డ్వాక్ర మహిళలకు,  బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జ‌రుగుతుంద‌న్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ ఇస్తున్న హామీలు, నవరత్నాలాంటి పథ‌కాలకు ఆకర్షితులై పార్టీలోకి రావడం శుభ పరిమాణమ‌న్నారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళి రాజన్న పాలన వ‌స్తుంద‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నార‌ని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయితే పేద‌ల బతుకులు మారతాయి విశ్వాసం వ్య‌క్తం చేశారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మన కృషి, పట్టుదల అవసరం అని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్ సి హెచ్ రంగారెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.
Back to Top