వైయస్‌ జగన్‌ను కలిసిన 104 ఉద్యోగులు


 తూర్పు గోదావరి:  వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. సోమవారం బురదమయమైన రోడ్లపై నుంచే వైయస్‌ జగన్‌ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పెద్దాడ గ్రామం వద్ద 104 ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. మహానేత ప్రవేశపెట్టిన 104 పథకాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. సకాలంలో వేతనాలు అందడం లేదని తెలిపారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌..మరో ఏడాది ఓపిక పడితే మేలు జరుగుతుందని వారికి భరోసా కల్పించారు.
 
Back to Top