నూరు చంద్రబాబులైనా వైఎస్సార్ కి సాటిరారు

హైదరాబాద్ః ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. రూల్స్ రద్దు చేసి మరీ ప్రజాస్వామ్యానికి సమాధి కడుతోందని మండిపడ్డారు  ప్రభుత్వం, స్పీకర్ పై అవిశ్వాసం సందర్భంగా, ద్రవ్యవినిమయ బిల్లు సందర్భంగా...అధికారపక్షం అనైతికంగా అక్కున్న చేర్చుకున్న వారిని కాపాడుకునేందుకు ప్రయత్నించింది తప్ప చట్టాన్ని, న్యాయాన్ని పట్టించుకోలేదన్నారు. 

బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు అవాస్తవాలు, అబద్ధాలు చెబుతున్నారని....ఎక్కడ కూడా నైతికత పాటించకపోవడం దుర్మార్గమన్నారు. అత్యంత దుబారాతో కూడిన పట్టిసీమను పూర్తిచేశామని గొప్పగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. కాంట్రాక్టర్ కు లాభం చేకూర్చడం కోసం పట్టిసీమను తీసుకొచ్చారు తప్ప మరొకటి లేదన్నారు. కేవలం 2 టీఎంసీల నీరు ఇచ్చి కృష్ణానదిని కాపాడామని బాబు డంబాలు పలుకుతున్నారని విమర్శించారు. 

చంద్రబాబు దిగజారి అబద్ధాలను గొప్పగా చెప్పుకుంటున్నారని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వంద పుంగనూరులు కలిసినా ఒక బెంగళూరు ఎలా కాదో... నూరు మంది చంద్రబాబులు కలిసినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి  సాటిరారని విశ్వేశ్వర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ప్రత్యేకహోదా వస్తే తప్ప వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదన్నారు. వెనుకబడిన ప్రాంతాలను బాబు నిర్లక్ష్యం చేశారని,  చర్చను ఎదుర్కోలేక మొక్కుబడిగా ముగించారని దుయ్యబట్టారు. 
Back to Top