1,000 కి.మీ. పూర్తవనున్న షర్మిల పాదయాత్ర

హైదరాబాద్, 18 ఫిబ్రవరి 2013: శ్రీమతి షర్మిల చేస్తున్న చారిత్రక, సుదీర్ఘ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారంనాడు 1,000 కిలోమీటర్ల మైలురాయిని దాటుతున్నది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండ్రపోలు కాల్వ వద్ద సరిగ్గా వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతాయి. వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్ నుంచి 2012 అక్టోబర్‌ 18న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ‌ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం వరకు శ్రీమతి షర్మిల 991.2 కిలోమీటర్లు నడిచారు. మరో 8.8 కిలోమీటర్లు నడిస్తే వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతుంది.

శ్రీమతి షర్మిల పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కొండ్రపోలు గ్రామస్తులు‌ అక్కడ‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ విగ్రహాన్న్నాని ఏర్పాటు చేశారు. కొండ్రపోలు గ్రామానికి చెందిన సూర్యానాయక్ అనే గిరిజన రైతు తన వ్యవసాయ భూమిలో 240 గజాల స్థలాన్ని వై‌యస్‌ఆర్ విగ్రహం ఏర్పాటుకు ఇచ్చారు. వైయస్ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరిస్తారు. మరోవైపు వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా వై‌యస్ కాంగ్రె‌స్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబి‌రాన్ని పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు.
Back to Top