రాజన్న సువర్ణయుగం వైయస్‌ జగన్‌తోనే సాధ్యం


వెయ్యి మంది కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక 
 – వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు రవిబాబు
విశాఖ: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం రావాలాంటే ఒక్క వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు రవిబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన వెయ్యి మంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కొత్తూరు, కాశీపట్నం పరిసరాలలో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి రవిబాబు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మోసపోయిన గిరిజనులు వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ఢృడ సంకల్పంతో ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ఆకర్శితులై టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారని చెప్పారు. విశాఖ మన్యంలో వైయస్‌ఆర్‌సీపీ జెండాలను రెపరెపలాడిస్తామన్నారు.
 
Back to Top