వంద మంది యువకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక


వైయస్‌ఆర్‌ జిల్లా: రాజంపేట నియోజకవర్గంలోని వంద మంది యువకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. జిల్లాలోని సిద్దవటంలో వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయాన్ని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మన్నూరులో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. ఈ విషయంలో రాజంపేట ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం పలువురు యువకులకు పార్టీ కండువాలు కప్పి మిథున్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. 
 
Back to Top