వైయ‌స్ఆర్ సీపీలో చేరిక


తూర్పుగోదావరి :   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఇత‌ర పార్టీల నేత‌లు ఆక‌ర్శితులై వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నారు. గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన సుమారు వంద మంది పార్టీ కో ఆర్డినేటర్‌ జ్యోతుల చంటిబాబు సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ లో చేరారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో కామరాజుపేట గ్రామ నాయకుడు, మాజీ వైస్‌ ఎంపీపీ  శింబోతుల తాతారావు, అద్దిపల్లి అప్పారావు, సేనాపతి జానకి, బొడ్డపాటి వెంకటరమణ, ఎలగశెట్టి పెద్ద, శీరంశెట్టి అప్పారావు, అరిశే లోవరాజు, గుర్రం పెద్ద, మట్టా సత్తిబాబు, ఎలగశెట్టి సూరిబాబు, దశరథ రామకృష్ణ, ఎలుగుల శ్రీను, తదితరులు చేరారు. వీరికి చంటిబాబు పార్టీ కండువాలు చేశారు. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా శ్రమించాలని కోరారు.  కార్యక్రమంలో ముమ్మన అర్జునరావు, శింబోతుల శ్రీను, గండ్రేడ్డి త్రిమూర్తులు, పినగోల వెంకటరమణ, నీలపల్లి సత్యనారాయణ, విరోతుల చంద్రరావు, కట్టమూరి బంగారం తదితరులు పాల్గొన్నారు.

Back to Top