వైయస్‌ఆర్‌ సీపీలోకి వంద మంది మైనార్టీ నాయకులు

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పార్టీ రేపల్లె నియోజకవర్గ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు మోసాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో మోపిదేవి ఆధ్వర్యంలో 100 మంది మైనార్టీ నాయకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. జననేత ప్రకటించిన నవరత్నాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top