గంగుల సమక్షంలో వైయస్సార్సీపీలో చేరిన 100 కుటుంబాలు

కర్నూలుః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసులు మరింతగా ఊపందుకున్నాయి. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగడుతున్న వైయస్ జగన్ నాయకత్వానికి ప్రతీ ఒక్కరూ ఆకర్షితులవుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి టీడీపీకి చెందిన 100 కుటుంబాలు వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి  అవినీతి, అక్రమాలే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని పార్టీలో చేరిన నాయకులు మండిపడ్డారు. వైయస్సార్సీపీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. 

Back to Top