విజ‌య‌వంతంగా ప్ర‌జా పాద‌యాత్ర‌
ప్ర‌కాశం:  వెలిగొండ ప్రాజెక్టు సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా పాద‌యాత్ర ప్ర‌కాశం జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఈ నెల 15వ తేదీ ప్రారంభ‌మైన పాద‌యాత్ర జిల్లాని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పూర్తై   ప‌దో రోజు శుక్ర‌వారం ఉదయం 9 గంటలకు మార్కాపురం మండలం గజ్జలకొండ  నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి దొనకొండ మండలం ఇండ్లచెరువు సమీపానికి  చేరుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత అక్కడి నుండి బయలుదేరి ఇండ్లచరువు మీదుగా దొనకొండ  చేరుకొని రాత్రికి బస చేస్తారు. మొత్తం 15 కోలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. ఈ సంద‌ర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రకాశంపై నిర్లక్ష్యం వహించడం వల్లే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదని   విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన పాదయాత్రకు లభిస్తున్న మద్దతును, అభిమానాన్ని తాను ఎన్నటికి మరచిపోనన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అప్పుడే మీ కష్టాలన్ని పోయి వర్షాలు పడి ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు. పశ్చిమ ప్రకాశంలో కరువును శాశ్వతంగా నివారించేందుకు అధికారంలోకి రాగానే వెలిగొండప్రాజెక్టుపై దృష్టి పెడతామని, నీళ్లిచ్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.  
Back to Top