<img alt="ysrcp nri wing of connecticut donat food for homeless children" title="ysrcp nri wing of connecticut donat food for homeless children" style="width:700px;height:440px;vertical-align:middle" src="/filemanager/php/../files/jagan28d.jpg">కనెక్టికట్ (యుఎస్ఎ), 28 సెప్టెంబర్ 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జగననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన సందర్భంగా కనెక్టికట్‌లోని పార్టీ ప్రవాసాంధ్ర విభాగం సంబరాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఇల్లు లేని అనేక మంది నిరుపేద పిల్లలకు ఆహారాన్ని అందించింది. శ్రీ జగన్‌పై వచ్చిన క్విడ్ ప్రో కో ఆరోపణలకు ఆధారాలు లభించలేదని కోర్టుకు సిబిఐ రాతపూర్వకంగా మెమో దాఖలు చేయడం, ఆయన ఆస్తుల కేసుకు సంబంధించి అన్ని చార్జిషీట్ల విషయంలో విచారణ పూర్తయిందని పేర్కొనడాన్ని కనెక్టికట్ పార్టీ ఎన్నారై విభాగం స్వాగతించింది. సిబిఐ మెమో అనంతరం సిబిఐ కోర్టు శ్రీ జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తంచేసింది. ఆరోపణలు రుజువు కాకపోవడంతో జననేత 'ధర్మ విజేత'గా బయటికి వచ్చారని ప్రస్తుతించింది.<br><br>నిరుపేద చిన్నారులకు ఆహారం పంపిణీ చేసిన కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ కనెక్టికట్ ఎన్నారై విభాగం సభ్యులు రత్నాకర్, శ్రీని వాసిరెడ్డి, జితేన్‌రెడ్డి, విజయ్ బి. కృష్ణమోహన్, సురేష్ నగరిమడుగు, రమేష్ వల్లెపు, సయ్యద్ ఖాద్రి, శ్రీధర్ చాగరి, మధు వాకటి, విజయ్ లింగారెడ్డి, సత్యపాల్ సల్లా, రాజ్ అవధానుల, హేమచంద్ర చిల్లకూరు, వెంకట్ మేడ, బర్గత్ పాలుపంచుకున్నారు.