అమెరికాలో వైయస్‌ఆర్‌సీపీ నేతల గ్రీట్‌ అండ్‌ మీట్

అమెరికా నాటా కన్వెన్షన్‌లో వైయ‌స్‌ జగన్‌కు ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం
పార్టీ నేతలతో అంతరంగం పంచుకున్న ఎన్‌ఆర్‌ఐలు
హోదా కోసం పోరాడుతోంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే
పోరాటాల ద్వారా హోదాను సజీవంగా ఉంచింది వైయ‌స్‌ జగనే
పదవుల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న పార్టీ నేతలు
2019లో వైయస్‌ జగన్‌ సీఎం కావటం ఖాయం. 

అమెరికా: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా కన్వెన్షన్లో రెండో రోజు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రీట్‌ అండ్‌ మీట్‌ కార్యక్రమము జరిగింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  మాట్లాడుతూ – ప్రత్యేకహోదాను ఇప్పటికీ సజీవంగా ఉంచింది మొదటి నుండీ పోరాడుతున్నది ఒక్క వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా కోసం పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డి  అమరణ దీక్షలు చేయటంతో పాటు అనేక చోట్ల యువభేరి సభలు పెట్టి ప్రత్యేక హోదాని సజీవంగా ఉంచారన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ముందుకుతీసుకెళ్లే నేపథ్యంలోనే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టటంతో పాటుగా ఆఖరికి ఎంపీ పదవులుని కూడా తృణప్రాయంగా త్యజించామన్నారు. 

ప్రత్యేకహోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డి మాట్లాడుతూ .. ప్రత్యేక హోదా వల్ల దేశంలోని కొన్ని రాష్ట్రాలు శీఘ్రగతిన అభివృద్ధి చెందాయన్నారు. 2014 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేసి 15 సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తామని వాగ్దానం చేసి ప్రజలని మోసం చేసారని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా కోసం ప్రజల ఆకాంక్ష తెలియచేయాలనే ఉద్దేశ్యంతోనే ఎంపీ పదవులకి రాజీనామా చేశామని స్పష్టం చేశారు. మేము రాజీనామా చేసిన స్థానాలకు ఉపఎన్నికలు రావాలని కోరుకొంటున్నామని తద్వారా ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షను కేంద్రాన్ని తెలియచేయగలుతామని ఆయన అన్నారు. 

రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు  మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న పోరాటానికి ఎన్‌ఆర్‌ఐలు కూడా మద్దతు తెలపాలని కోరారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ– ఎవరు ఎన్ని రకాలుగా పొత్తులు పెట్టుకున్నా, ఎవరు ఎన్ని రకాలుగా కుయుక్తులు పన్నినా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌ రెడ్డి  మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు మోసం చేయని వర్గమంటూ లేదని రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పటం ఖాయమన్నారు. 

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత  మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు ముఖ్యపాత్ర పోషించాలని ఎన్నికలలో అందరూ వచ్చి మీమీ నియోజకవర్గాలలో చంద్రబాబు మోసాలను ప్రజలకి వివరించాలని కోరారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌ రెడ్డి గారు మాట్లాడుతూ– ప్రత్యేకహోదా కోసం ఎంపీలు చేసిన రాజీనామాలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. అనంతపురం పార్లమెంట్‌ ఇంచార్జ్‌ నదీమ్‌ మాట్లాడుతూ మైనారిటీలు ఎప్పటికీ వైయస్‌ కుటుంబానికి అండగా ఉంటారని మైనార్టీలుకి మేలు చేసింది ఒక్క వైయస్సార్‌ మాత్రమేనని తెలిపారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న మిగతా వక్తలు ప్రసంగిస్తూ చంద్రబాబు చరిత్ర అంతా మోసాలు అబద్దాలనేనని ఇప్పటికీ బీజేపీతో అంటకాగుతూ ప్యాకేజి ఇవ్వాలని ఉత్తరాలమీద ఉత్తరాలు రాస్తున్నాడని మండిపడ్డారు. పైకి మాత్రం హోదా అంటూ నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. రాబోయే ఎన్నికలలో ఎన్‌ఆర్‌ఐలు అందరూ ప్రచారంలో పాల్గొనాలన్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిల్లో లేరని చంద్రబాబుని ఓడించటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు . 

ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐలు కూడా తమ అభిప్రాయాలని పంచుకొన్నారు. మండుటెండల్లో  వైయస్‌ జగన్‌ గారు పాదయాత్ర చేయటం సాహసంతో కూడుకున్నదని ప్రజల స్పందన చూస్తుంటే 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేయటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలని సోషల్‌ మీడియాలో ఎండగట్టడంతో పాటుగా ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి ప్రచారంలో పాల్గొంటామని చంద్రబాబుని చేస్తున్న మోసాల నుండి ప్రజలని రక్షించటానికి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి అండగా ఉంటామని ఎన్‌ఆర్‌ఐలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
Back to Top