వైయస్సార్ జీవితమంతా ప్రజలకోసమే పనిచేశారు

  • పార్టీ యూకే అండ్ యూరప్ వింగ్ ఆధ్వర్యంలో..
  • లండన్ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
  • పేదల జీవితాల్లో వెలుగునింపిన మహనీయుడు
  • వైయస్సార్, ఆయన చేసిన సేవలను స్మరించుకున్న ఎన్నారైలు

  • లండన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి బ్రిటన్‌లో ఘనంగా జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ యూకే అండ్ యూరప్ వింగ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 10న మిల్టన్ కేన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 150కిపైగా ఎన్నారైలు హాజరై దివంగత మహానేత వైయస్సార్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేశారు.  కోట్లాది మంది  జీవితాల్లో వెలుగులు నింపిన డాక్టర్ వైయస్ఆర్ జీవిత ప్రస్థానం.. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆడియో, వీడియో దృశ్యాలను ప్రదర్శించారు.

    ఈ కార్యక్రమంలో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా లైవ్‌లో వైయస్సార్సీపీ ఎన్నారై కన్వీనర్ వెంకట్ మేడపాటి మాట్లాడుతూ... డాక్టర్ వైయస్సార్ సేవలను కొనియాడారు. ఆయన జీవితమంతా ప్రజలకోసమే పనిచేశారన, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సమాజంలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైయస్సార్ ది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పార్టీ యూకే అండ్ యూరప్ వింగ్‌ను, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలను ఆయన అభినందించారు. ఇతర నేతలు, ఆహూతులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ప్రేమ, ఆదరాభిమానాలను చూరగొన్న వైయస్సార్ సేవలను స్మరించుకున్నారు.

    ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ యూకే అండ్ యూరప్ వింగ్ కు చెందిన శివకుమార్ చింతం, కొఠారి అబ్బయ్య చౌదరి, సందీప్‌రెడ్డి వంగల, కిరణ్‌ పప్పు, పూర్ణచందర్‌రావు కొడే, జనార్దన్ రెడ్డి, సతీష్ నర్రెడ్డి, ఎన్ఆర్ రెడ్డి, మనోహర్ నక్కా, సతీష్‌ వనహారం, అమర్‌నాథ్ కొల్లాం తదితరులు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైయస్సార్ ఆశయాలను కొనసాగించడానికి ....వైయస్సార్సీపీకి, వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి మద్దతుగా నిలువాల్సిన అవసరముందని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తించిన మండలాల్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, వారికి శిక్షణ ఇవ్వడానికి సాయపడాలని ఈ సందర్భంగా తీర్మానించారు.

Back to Top